Site icon NTV Telugu

TFCC: ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..

D Suresh Babu Tfcc Presiden

D Suresh Babu Tfcc Presiden

TFCC: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (TFCC) ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. మొత్తం 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, మన ప్యానెల్ 15 స్థానాలకు పరిమితమైంది.

READ ALSO: Harish Rao : రేపు అసెంబ్లీకి కేసీఆర్.. హరీష్ రావు క్లారిటీ..!

TFCC నూతన అధ్యక్షుడిగా అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఛాంబర్ పగ్గాలను సమర్థంగా నిర్వహించగల అనుభవం, పరిశ్రమ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సురేష్ బాబు అధ్యక్షుడిగా రావడంతో టాలీవుడ్‌లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది.

కీలక పదవుల్లో వీరే..
ఈసారి TFCC కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నిర్మాతలకు కూడా సముచిత స్థానం దక్కింది. ఉపాధ్యక్షులుగా ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, భారత్ చౌదరిలు బాధ్యతలు చేపట్టనున్నారు. పంపిణీ, నిర్మాణ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న వీరి ఎన్నిక చిత్ర పరిశ్రమ బలోపేతానికి దోహదపడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సురేష్ బాబు నేతృత్వంలోని టీమ్‌లో కీలక బాధ్యతలు పొందిన వారు వీరే..

సెక్రటరీ (కార్యదర్శి): కొల్లా అశోక్ కుమార్

జాయింట్ సెక్రటరీలు: మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి

ట్రెజరర్ (కోశాధికారి): ముత్యాల రామదాసు

READ ALSO: Sheraj Mehdi: అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పడానికి ‘ఓ అందాల రాక్షసి’: షెరాజ్ మెహదీ

Exit mobile version