Site icon NTV Telugu

Nara Lokesh meets Amit Shah: మొంథా తుఫాన్‌ నష్టం రూ.6,352 కోట్లు.. అమిత్‌షాకు లోకేష్‌ నివేదిక..

Nara Lokesh Meets Amit Shah

Nara Lokesh Meets Amit Shah

Nara Lokesh meets Amit Shah: మొంథా తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్నే మిగిల్చింది.. ఇప్పటికే ప్రాథమిక అంచనాలపై కేంద్రానికి నివేదిక చేరగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌, హోంమంత్రి అనిత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.. మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తుపాను నష్టాలపై పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్, రాష్ట్ర హోంమంత్రి అనిత సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టపరిహారం అవసరాలపై సమగ్ర వివరాలు లోకేష్ అందించారు. తుపాను వల్ల మొత్తం రూ.6,352 కోట్ల నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.

Read Also: Vivo X300 Pro Launch: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ.. పిచ్చెక్కించే ఫీచర్లతో వివో ఎక్స్ 300 ప్రో లాంచ్!

మొంథా తుపాను మొత్తం 3,109 ప్రభావిత గ్రామాల్లో ప్రభావం చూపించింది.. తుపాను తీరం దాటి సమయం: అక్టోబర్ 28 రాత్రి, కాకినాడ సమీపంలో గాలి వేగం గంటకు 100 కి.మీ వేగంతో ఉంది.. అయితే, పునరావాస చర్యల్లో 1.92 లక్షల మందిని 2,471 శిబిరాలకు తరలించాం.. తుపాను అనంతరం ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వెంటనే రూ.3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం పంపిణీ చేసింది. అదేవిధంగా, కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్‌ పునరుద్ధరణ, తాగునీటి సరఫరా వంటి అత్యవసర చర్యలు చేపట్టినట్లు లోకేష్ వివరించారు. అత్యవసర అవసరాల నిమిత్తం రూ.60 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసినట్లు తెలిపారు.

రంగాల వారీగా నష్టం ఇలా:
వ్యవసాయ రంగం – రూ.271 కోట్లు
గృహ నష్టం – రూ.7 కోట్లు
రహదారులు & మౌలిక వసతులు- రూ.4,324 కోట్లు
విద్యుత్ రంగం- రూ. 41 కోట్లు
నీటిపారుదల & నీటి వనరులు – రూ.369 కోట్లు
శాశ్వత నిర్మాణాలు- రూ.1,302 కోట్లు
సామూహిక ఆస్తులు-రూ.48 కోట్లు

Exit mobile version