మిచౌంగ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో చాలా వరకు గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఇక వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశానికి నిచ్చేన వేస్తున్నాయి.. మొన్నటివరకు ఐదు, పది ఉన్న టమోటా ధరలు భారీగా పెరిగాయి.. టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది. 20 కిలోలు ఉన్న టమోటా బాక్స్ ధర 400 రూపాయలు పలికింది. అంటే కిలో ధర 20 రూపాయలు అన్నమాట. ఇది కేవలం ఆస్పరి టమోటా మార్కెట్‌లో మాత్రమే ఉంది.
ఇలా మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌కు.. ఇక్కడ టమోటా ధరలు పెరగడానికి.. చెన్నైకి ఆస్పరి మార్కెట్ నుంచే టమోటా ఎగుమతి కావడమే ఇందుకు కారణం. పత్తికొండ, కర్నూలు, ప్యాపిలి టమోటా మార్కెట్లకు ఆ ధర లేదు. ఈ రోజు కర్నూలు రైతు బజార్‌లో కిలో టమోటా ధర కేవలం 14 రూపాయలు మాత్రమే.. కర్నూలు, పత్తికొండ, ప్యాపిలి మార్కెట్లలో ధరలు సాధారణ స్థితిలో ఉన్నాయి. కిలో 15 రూపాయలకు మించి లేవు. అదే ఆస్పరి హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమోటా ఇరవై రూపాయలు పలుకుతుండటం విశేషం.. ప్రస్తుతం ధరలు పైపైకి చేరాయి.. ఇక ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..
అదే విధంగా.. ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దసరా, దీపావళి సమయంలో కిలో ఉల్లి ధర రూ.30 ఉండగా ప్రస్తుతం రూ. 80కి చేరింది. గతంలో టమోట ధరతో హడలిపోయిన ప్రజలు ప్రస్తుతం ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్నారు..ఉల్లి ధరలు పెరగడంతో చాలా మంది ఇండ్లలో ఉల్లిగడ్డల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ధరల పెరుగుదలకు దిగుబడి తగ్గడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉల్లిపంటతో లాభం లేకపోవడంతో రైతులు కూడా వేరే పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు..
