Cyber Crime: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు.. స్మార్ట్ యుగంలో ఓ లింక్ మాటున.. ఏ మోసం దాగి ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఏదైనా లింక్‌ను పొరపాటున క్లిక్ చేసినా.. ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ అయిపోతోంది.. ఇక, కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా పోలీసులకు సైతం కుచ్చుటోపీ పెట్టి సవాల్ విసురుతున్నారు. తాజాగా, కోడుమూరు సీఐ మన్సురుద్దీన్ అకౌంట్ నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు కొట్టేసిన ఘటన కలకలం రేపింది. ఈ నెల నాలుగో తేదీన.. సీఐ ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు గుర్తించారు. సీఐ పర్సనల్ సిమ్ బ్లాక్ కావడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. సిమ్ ఆక్టివేట్ అయిన వెంటనే డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో హుటాహుటిన బ్యాంకు అధికారులను కలిశారు సీఐ మన్సురుద్దీన్.. డబ్బులు తాను డ్రా చేయలేదని చెప్పడంతో అకౌంట్ ను పరిశీలించిన అధికారులు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. దీంతో సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Kalki 2898 AD : ప్రభాస్ ‘ కల్కి’ ట్రైలర్ పై భారీ అంచనాలు..