Site icon NTV Telugu

Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు

Cyberabad Police

Cyberabad Police

Cyberabad Police: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్‌ లోని స్పా సెంటర్ల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని AHTU (ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్), లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశంలో ప్రజల భద్రత, ట్రాఫికింగ్ నివారణ, చట్టబద్ధ కార్యకలాపాలుపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించే స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రజల భద్రత, నగర ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలకు స్థానం ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్పా సెంటర్ల నిర్వాహకులకు పోలీసులు కొన్ని నిబంధనలను సూచించారు. ఇందులో ముఖ్యంగా..

Read Also:IBPS PO Notification 2025: త్వరపడండి.. పరీక్ష ఒక్కటే.. 11 బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలు..!

* స్పాల్లో అవాంఛిత లైంగిక కార్యకలాపాలకు నోటీసులు లేకుండా జరగకూడదు.

* ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలి.

* స్పా సెంటర్లు వసతి స్థలంగా లేదా రెసిడెన్షియల్ యాక్సెస్‌తో ఉండకూడదు.

* స్పా ఉద్యోగులందరికీ ఫిజియోథెరపీ, అక్యుప్రెషర్ లేదా ఓకుపేషనల్ థెరపీలో సరైన అర్హత ఉండాలి.

* అందరి ఉద్యోగుల వివరాలు రిజిస్టర్‌లో ఉండాలి. పనిచేసే ఉద్యోగుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు కావాలి.

* లైసెన్స్ నంబర్, సెంటర్ పేరు, పని సమయాలు, ఫీజుల వివరాలు స్పష్టంగా చూపించాలి.

* సీసీటీవీలు (CCTV) ప్రవేశ ద్వారం, రిసెప్షన్, కామన్ ఏరియాల్లో ఉండాలి. రెండు, మూడు నెలల రికార్డింగ్‌లు భద్రపరచాలి.

* 10 మందికి పైగా సిబ్బంది ఉన్న స్పాల్లో POSH చట్టం ప్రకారం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి.

Read Also:Bank of Baroda: ఇప్పుడు మిస్ అయ్యారో మళ్లీ బ్యాంకు ఉద్యోగం కష్టమే.. BOB బ్యాంకులో 2500 ఖాళీలు..!

ఇకపోతే 2021లో తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు ప్రకారం.. కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, సందర్శించిన తేదీలు రిజిస్టర్లో ఉండాలి. ఇంకా ఎప్పుడైనా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణకు వీలు ఉండాలి. అలాగే ప్రధాన ద్వారం పని సమయాల్లో తెరిచి ఉంచాలని ఉంది.

ఈ సమావేశానికి మాదాపూర్ DCP డా. వినీత్.జి (IAS), మహిళా, శిశు భద్రతా విభాగం DCP శ్రీమతి స్రుజన కర్ణం, SOT DCP శోభన్ కుమార్, ADCP శ్రీనివాస్ రెడ్డి, ACP సత్యనారాయణ, ACP శ్రీనివాస్, AHTU ఇన్‌స్పెక్టర్ జేమ్స్ బాబులతోపాటు పలువురు అధికారులు, మాదాపూర్ జోన్‌కు చెందిన స్పా యజమానులు, ప్రతినిధులు హాజరయ్యారు.

Exit mobile version