NTV Telugu Site icon

Cyber Fraud Village : అది పేరుకే విలేజ్‌.. మొత్తం సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఊరు

Cyberatteck

Cyberatteck

Cyber Fraud Village : ఐదు రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిబ్బంది.. 23 మంది సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ల వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత‌ వెల్లడిస్తూ.. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితులు నేరాలకు పాల్పడినట్లు ఆమె వెల్లడించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో 14 కేసులలో వీళ్లు నిందితులని ఆమె తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 328 కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఆమె వివరించారు. డిజిటల్ అరెస్టు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఓటిపి ల పేరుతో బాధితులను నిట్టనిలువునా నేరగాళ్ళు ముంచినట్లు ఆమె తెలిపారు. కోటి 90 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయంటూ ఫిర్యాదు చేశారని, నా అకౌంట్ లో ఉన్న కోటి లక్షల రూపాయలు నాకు తెలియకుండానే బదిలీ అయ్యాయని బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తులో లభించిన ప్రాథమిక ఆధారాలను ఉపయోగించి ఒక టీం యూపీ కి వెళ్ళిందన్నారు. అక్కడ ఒక మహిళా బదిలీ చేసిన్నట్లు గుర్తించారని, 60 ఏళ్ల కమలేష్ కుమారి ఈ ట్రాన్సాయాక్షన్ చేసినట్లు గుర్తించారన్నారు. తన ఫోను హ్యాక్ కావడం ద్వారా ఈ నగదు బదిలీ అయినట్లు గుర్తించామని ఆమె తెలిపారు.

 Electricity Bill: ఓరి దేవుడా ఆ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు..

కమలేష్ కుమారిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు సైబరాబాద్ సిబ్బంది తీసుకుని వచ్చినట్లు తెలిపారు. మరో కేసు ఆగస్టులో బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. రెండు కోట్ల 95 లక్షల రూపాయల ట్రేడింగ్ లో పోగొట్టుకున్న కేసు అని, ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు ఇది అని ఆమె వెల్లడించారు. కన్నడకు చెందిన సమీర్, దీపక్ లు వీళ్ళిద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. దుబాయ్ కి చెందిన రితేశ్ సోనీ అనే వ్యక్తితో కలిసి ఈ నేరాలు చేస్తున్నారని, ఇక్కడ దోచుకున్న డబ్బును దుబాయ్ కి బదిలీ చేస్తున్నారని, ఇలా దుబాయ్‌కి నగదు పంపించడం ద్వారా ఐదు శాతం కమిషన్ వీళ్ళిద్దరూ పొందుతున్నారన్నారు. మార్వెల్ క్యాప్ట వాట్సప్ గ్రూపు ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో నేరగాళ్ళు మోసాలకు బలపడుతున్నట్లు ఆమె తెలిపారు. ట్రేడింగ్‌లో దాదాపు కోట్ల రూపాయలు బాధితుల పోగొట్టుకుంటున్నారని, కాబట్టి ట్రేడింగ్‌ను గుర్తింపు పొందిన వాటి ద్వారానే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు డీసీపీ కవిత. మరో కేసులో కస్టమ్స్, కొరియర్ పేరుతో మోసం కి పాల్పడ్డారని, ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో బెదిరించి దాదాపు 34 లక్షల రూపాయలు తీసుకున్నారన్నారు. ఎనిమిది రోజుల తర్వాత బాధితులు వచ్చి ఫిర్యాదు చేశారని, నేరస్తులను పట్టుకున్నందుకు ప్రత్యేక టీం ని ఏర్పాటు చేశామన్నారు.

 

గుజరాత్‌లో అహ్మద్ నగర్ లో ఇద్దరు నేరస్తులను గుర్తించారని, అక్కడికి వెళ్లి ఇద్దరు నిందితులను పీటి వారెంట్‌పై తీసుకుని వచ్చారన్నారు. తెలంగాణలోని ఓ ఊరు మొత్తం కూడా కమిషన్ల కోసం ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతుందన్నారు. ఆ ఊరిని గుర్తించి, అక్కడ అవసరమైన అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొచ్చి వాళ్ళని ఇలాంటి ట్రేడింగ్ మోసాలు పాల్పడకుండా చూసేలా చర్యలు చేపడుతున్నామని, తెలంగాణాలోనూ రాజస్థాన్ లోని జంతారా తరహా గ్రామమని ఆమె తెలిపారు. ఆ గ్రామం కమీషన్ లో కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు.. దర్యాప్తులో ఈ గ్రామం వెలుగులోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. అయితే.. ఈ దర్యాప్తుతో అలెర్ట్ అయిన సైబర్ క్రైమ్ అధికారులు మరింత ఫోకస్‌ పెడుతున్నట్లు తెలిపారు.

CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..

Show comments