లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయించింది. అందుకు రాహుల్ కూడా అంగీకరించవచ్చని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.