NTV Telugu Site icon

Flood Watch: వచ్చేసిన ‘ఫ్లడ్ వాచ్ యాప్’.. ఇక వరద సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చు

Flood Watch

Flood Watch

Flood Watch For Floods Update: ఇటీవల దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వరదల దాటికి నదులు ఉప్పొంగి ప్రవహించాయి.కొండచరియాలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా పలుచోట్ల భవనాలు సైతం వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఎంతో మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పొయారు. ఇక దేశవ్యాప్తంగా వరదలు పెరగడంతో కేంద్ర జలశక్తి కమిషన్ (సీడబ్ల్యూసీ) ‘ఫ్లడ్‌వాచ్‌’ (FloodWatch) పేరుతో ఓ సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ సాయంతో దేశంలో ఏ ప్రాంతంలో అయినా వరద సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వరద సమాచారాన్ని ప్రజలకు అందించి వారిని అప్రమత్తం చేయడమే ఈ యాప్ లక్ష్యం. సమాచారాన్ని మన మొబైల్ కు టెక్ట్స్ లేదా ఆడియో రూపంలో అందిస్తారు. ఇందులో ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషలు అందుబాటులో ఉన్నాయి.

Also Read:Viral Video: యువతికి వేధింపులు.. పంచాయతీ తీర్పుతో చెప్పుతో కొట్టిన అమ్మాయి

ఈ యాప్  ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది. వరద గురించి ఈ యాప్ ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుందని సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ కుశ్వీందర్‌ వోహ్రా తెలిపారు.338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ యాప్‌ క్రోడీకరిస్తుందోని వోహ్రా తెలిపారు. ఈ యాప్ లో ఇండియా మ్యాప్ ఉంటుంది. దానిలో వాటర్ ఉన్న ప్రాంతాలు బ్లూ కలర్ లో ఉంటాయి. వాటిపై గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ గుర్తులు ఉంటాయి. గ్రీన్ గా ఉంది అంటే అక్కడి నీటి మట్టం నార్మల్ గా ఉందని అర్థం, ఇక ఎల్లో లో నార్మల్ కంటే కొంచెం ఎక్కువ నీరు ఉందని, ఆరెంజ్ గుర్తు ఉంటే ప్రమాద స్థాయికి వస్తుందని అర్ధం. ఇక రెడ్ కలర్ గుర్తు ఉండే ఆ ప్రాంతంలో వరద రాబోతుందని గుర్తుంచుకోవాలి.

ఇక వాటిపై క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉండే నీటి స్థాయి, పెరిగిన నీటిస్థాయి, అక్కడి పరిస్థితులు అన్నీ మీకు ఆడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇది మీకు 24 గంటలు ముందుగానే సమాచారం అందిస్తుంది. శాటిలైట్‌ డేటా విశ్లేషణ, గణాంకాల నమూనా, రియల్‌ టైమ్‌ సమాచారాన్ని వినియోగించుకునే అధునాతన సాంకేతికతతో ఈ యాప్ ని రూపొంచినట్లు ఓహ్రా తెలిపారు. ఈ యాప్ లో ఏడురోజుల వరకు సూచనలు కనిపిస్తాయి. ఈ యాప్ లో రాష్ట్రాల పేరు ఆధారంగా సెర్చ్ చేసి వరద సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఎక్కడెక్కడ వరదలు ఉన్నాయో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. మ్యాప్ పై మనకు మొత్తం సమాచారం కనబడుతుంది.
గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Show comments