Telangana DGP: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా C. V. ఆనంద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం హోం సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టింది ప్రభుత్వం. అనుభవం, పరిపాలనా సామర్థ్యం ఉన్న అధికారిగా సీవీ ఆనంద్‌కు మంచి పేరు ఉంది. పోలీసు శాఖలో వివిధ కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో కఠిన నిర్ణయాలు తీసుకునే అధికారిగా గుర్తింపు పొందారు.
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

Cv Anand