Site icon NTV Telugu

Mumbai: ఎయిర్‌పోర్టులో 12 కోట్ల విలువైన గోల్డ్, ఫోన్లు పట్టివేత

Keje

Keje

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఈ మొత్తంలో దొరకడంతో కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Guess The Actress : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి?

కస్టమ్స్ అధికారులు ఐదుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. చాలా తెలివిగా ఆభరణాలు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా రూపాల్లో తీసుకురావడంతో అవాక్కయ్యారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్‌ బాటిల్స్‌, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్‌ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

 

Exit mobile version