Site icon NTV Telugu

Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన బ్యాగ్..

Mumbai

Mumbai

ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఓ విదేశీ ప్యాసింజర్ బ్యాగ్‌ కింది భాగంలో దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన 1.3 కిలోగ్రాముల కొకైన్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళను కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్‌ను బ్యాగ్‌ అడుగు భాగంలో దాచారు. అందులో ఓ మొబైల్‌ నంబర్‌ ఉండటంతో అధికారులు ఆ నంబర్‌కు కాల్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు.

Read Also: Modi Govt Cabinet Expansion: ఎన్నికల రాష్ట్రాలపై కేంద్రం దృష్టి.. కేబినెట్ విస్తరణకు రెడీ అయిన బ్లూ ప్రింట్

సరుకు తీసుకునేందుకు తాము చెప్పిన చోటికి రావల్సిందిగా కస్టమ్స్ అధికారులు చెప్పడంతో దీంతో సరుకు తీసుకునేందుకు వచ్చిన మహిళను కూడా అరెస్ట్ చేశారు. నిందితులి ఇద్దరి ఫోన్‌లోని డేటా ఆధారంగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12.98 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. మరోవైపు జూన్ 27 మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కస్టమ్స్ ‘సే నో టు డ్రగ్స్’ ప్రచారం కింద 8,946.263 కిలోల వివిధ రకాల నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను నాశనం చేశారు.

Read Also: MS Dhoni Security Guard: ఎంఎస్ ధోనీ మంచి మనసు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, హెరాయిన్, అల్ప్రాజోలం, ఎఫెడ్రిన్ హైడ్రోక్లోరైడ్, మెథాక్వలోన్ వంటి మత్తుపదార్ధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతీయేట జూన్ 26న జరుపుకుంటారు. ఈ రోజున మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కస్టమ్స్ అధికారులు అవగాహన కల్పిస్తారు.

Exit mobile version