NTV Telugu Site icon

SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్స్ వేయగలదా..?

Csk Vs Srh

Csk Vs Srh

IPL 2024: నేడు ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక, ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై టీమ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో ఓడిపోయింది.

Read Also: Human Trafficking : మదర్సాలకు తీసుకెళ్తామని చెప్పి 99మంది చిన్నారులను కూలీలుగా మార్చిన కేటుగాళ్లు

మరోవైపు గత మ్యాచులో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంది. ఈ టోర్నమెంట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.

Read Also: Tangella Uday Srinivas : కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్‌పై దుబాయ్‌లో లుక్‌ ఆవుట్‌ నోటీసులు

చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీమ్స్ ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లు ఆడగా అందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌లు, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు విజయం సాధించాయి. హైదరాబాద్ పై చెన్నై అత్యధిక స్కోరు 223గా ఉంది. కాగా సీఎస్కేపై సన్‌రైజర్స్ అత్యధికంగా 192 పరుగులు చేసింది. ఇక, చివరిసారిగా ఈ రెండు జట్లు ఏప్రిల్ 5వ తేదీన 2024న తలపడ్డాయి. ఇక, ఈ మ్యాచులో సోషల్ మీడియాలో కొనసాగుతున్న అంచనాలను చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచేందుకు 53 శాతం ఛాన్స్ ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేవలం 47 శాతం అవకాశం ఉందన్నారు.

Read Also: Loksabha Elections 2024 : నేడు కర్ణాటకలో ప్రధాని ముమ్మర ప్రచారం.. నాలుగు ర్యాలీల్లో పాల్గొననున్న మోడీ

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ ( కెప్టెన్ ), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతిషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ వచ్చే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ ( కెప్టెన్ ), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కెండే, జయదేవ్ ఉనద్కత్. ఇంపాక్ట్ ప్లేయర్ టీ నటరాజన్ వచ్చే ఛాన్స్ ఉంది.