Site icon NTV Telugu

CSK vs SRH: చపాక్ స్టేడియంలో మెరిసిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

Csk Vs Srh (1)

Csk Vs Srh (1)

CSK vs SRH: చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు పూర్తికాక ముందే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టు చివరి 5 ఓవర్లలో కేవలం 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. అటు SRH బౌలర్లు అద్భుతంగా రాణించారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో నాలుగు సిక్సర్ల సహాయంతో 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30 పరుగులు సాధించడంతో జట్టుకు చెప్పుకోతగ్గ స్కోర్ లభించింది. ఇక ఎంఎస్ ధోని తన 400వ టీ20 మ్యాచ్‌లో ఆడుతూ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కేవలం 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీనితో అభిమానులు నిరాశ చెందారు.

ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. జైదేవ్ ఉనద్కట్ కూడా 2.5 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కమిందు మెండిస్, జీషాన్ అన్సారీలు కూడా తమ బౌలింగ్‌తో సీఎస్‌కే బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో జట్టు పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఇప్పటివరకు SRH బౌలింగ్‌తో మ్యాచ్‌పై పట్టుపెట్టినట్లు కనిపిస్తోంది. CSK బౌలర్లు ఈ స్కోర్‌ను కాపాడగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version