ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో ఘన విజయంతో అత్యధిక ట్రోఫీలను కైవసం చేసుకుని.. సక్సెస్ పుల్ కెప్టెన్ గా రోహిత్ శర్మ సరసన నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వచ్చే సీజన్ ఐపీఎల్ లో ఆడతాడా.. లేదా అనే ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తుంది. అయితే తమ కెప్టెన్ కు భావోద్వేగమైన వీడియోను అంకితమిచింది సీఎస్కే యాజమాన్యం.
Also Read : Pawan kalyan Varahi Yatra: నేటి నుంచే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.. షెడ్యూల్ ఇదే!
అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ మాములుగా కనిపించడం లేదు.. స్టేడియంలో అడుగుపెట్టేటప్పుడి నుంచి బంతుల్ని బౌండరీలకు తరలించేదాకా.. అభిమానం వెల్లువలా పొంగింది. అయితే ఒకానొక టైంలో ఇదే ధోనికి లాస్ట్ ఐపీఎల్ సీజన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ చర్చ జోరుగా సాగింది.. ఈ సీజన్ మొత్తం.
Also Read : Ram Gopal Varma: రాజకీయాల్లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వర్మ..
తన రిటైర్మెంట్ పై స్పష్టమైన ప్రకటన చేయకుండా మీడియాను మిస్టర్ కూల్ కెప్టెన్ గందరగోళంలోకి నెట్టేశాడు. ఈ తరుణంలో ఉన్నట్లుండి ధోనిపై సీఎస్కే ఓ వీడియోను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అదీ ఓ కెప్టెన్ మై కెప్టెన్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో సీఎస్కే అభిమానుల్లోనూ పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్ కాగా.. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని కోలుకుంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెట్టిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని రిటైర్మెంట్ అయితే సీఎస్కే తర్వాత సారథి ఎవరు అనేది జోరుగా చర్చ జరుగుతుంది.
Oh Captain, My Captain! 🥹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023
