Site icon NTV Telugu

CSK Playoffs Chances: వరుసగా ఐదు ఓటములు.. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఇలా!

Csk Playoffs Chances 2025

Csk Playoffs Chances 2025

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దారుణ ప్రదర్శన చేస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన సీఎస్‌కే.. ఆపై వరుసగా ఐదు ఓటములు చవిచూసింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో అయితే హ్యాట్రిక్ ఓటమిని ఎదుర్కొంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించినా.. సీఎస్‌కే రాత మారలేదు. అంతేకాదు బంతుల పరంగా ఐపీఎల్‌లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వరుసగా ఐదు ఓటములతో చెన్నై ఫాన్స్ డీలా పడిపోయారు.

ఐపీఎల్ 2025లో సీఎస్‌కే ఆరు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించింది. ప్రస్తుతం పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే పేలవ ఫామ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలపై సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రస్తత ఫామ్ ప్రకారం సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏదైనా మాయ చేస్తే తప్ప.. ప్లేఆఫ్స్‌కు చేరుకోదు. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. మిగతా 8 మ్యాచ్‌లలో చెన్నై కనీసం 7 గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరుతుంది.

Also Read: Gold Price Today: బంగారం ప్రియలకు భారీ షాక్.. వరుసగా నాలుగో రోజూ బాదుడే!

మిలిగిన 8 మ్యాచ్‌లలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లలో ఓడిపోతే.. సీఎస్‌కేకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. 8 మ్యాచ్‌లలో 6 గెలిచినా.. అప్పుడు 14 పాయింట్లతో అవకాశం ఉంటుంది. అయితే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరడం చాలా చాలా అరుదు. ఒకవేళ 8 మ్యాచ్‌లలో 3 ఓడితే.. సీఎస్‌కే ఇంటిదారి పట్టక తప్పదు. ఈ నేపథ్యంలో మిగిలిన 8 మ్యాచ్‌లలో కనీసం ఏడింటిలో విజయాలు సాధించడం చెన్నైకి తప్పనిసరి. లక్నో, ముంబై, హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్ జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Exit mobile version