NTV Telugu Site icon

IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ ఔట్!

Devon Conway

Devon Conway

Devon Conway To Miss IPL 2024 Due to injury: ఐపీఎల్‌ 2024 ఆరంభానికి ముందు డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. చెన్నై స్టార్‌ ఓపెనర్‌, న్యూజీలాండ్ క్రికెటర్‌ డెవాన్‌ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్‌ 17 సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు. ఎడమ బొటన వేలికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం అతడికి 8 వారాలు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో డెవాన్‌ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా కాన్వేను స్కానింగ్‌కు తరలించగా.. ఫ్రాక్చర్‌ ఉన్నట్లు తేలింది. వైద్యులు అతడికి సర్జరీ అవసరమని సూచించారు. కాన్వే చేతి వేలికి త్వరలోనే శస్త్రచికిత్స జరగనుంది. శస్త్రచికిత్స అనంతరం అతడికి 8 వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు. దాంతో మే వరకు కాన్వే ఆటకు దూరమవుతాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 మొత్తానికి అతడు దూరం కానున్నాడు.

Also Read: KTR: చిన్నారుల ఆహ్వానం.. పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన కేటీఆర్‌!

ఐపీఎల్ 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించడంలో డెవాన్‌ కాన్వే పాత్ర కీలకం. ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’గా కాన్వే నిలిచాడు. కాన్వే దూరమవడం చెన్నైకి భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 672 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2022లో మెగా వేలంలో బేస్ ధర రూ.1 కోటికి న్యూజిలాండ్ స్టార్‌ కాన్వేను చెన్నై తీసుకుంది. 23 మ్యాచ్‌లు ఆడిన అతను 9 అర్ధ సెంచరీలతో 924 పరుగులు చేశాడు. చెన్నై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో చిదంబరం స్టేడియంలో తలపడనుంది.

 

Show comments