ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐపీఎల్ 2024 మార్చి 22న ఆరంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ఆరంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అయితే హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో ఎప్పుడో ప్రాక్టీస్ షురూ చేసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు.
ఐపీఎల్ 2024 నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. పలువురు ప్లేయర్లు ఇప్పటికే చెన్నై చేరుకొనిప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా ‘తాలా’ ఎంఎస్ ధోనీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. మహీ కారులో వచ్చి హోటల్ లోపలికి వెళ్ళిపోయాడు. ధోనీ ఎరుపు టీ-షర్ట్, గోధుమ రంగు ప్యాంటు ధరించి కారు నుంచి దిగుతూ సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. మహి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న సీఎస్‌కే ఫ్రాంఛైజీ.. ‘తలా దర్శనం’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ధోనీ ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: Janhvi Kapoor-RC16: ఇట్స్ ఆఫీషియల్.. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్! పుష్ప 2లో కూడా
నిజానికి ఎంఎస్ ధోనీ మార్చి 1నే చేనై రావాల్సి ఉంది. అయితే జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరవడంతో నాలుగు రోజులు ఆలస్యంగా వచ్చాడు. ఇక ప్రాక్టీస్ మొదలెట్టనున్నాడు. గతేడాది ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి చెన్నై అయిదోసారి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఈసారి కూడా టైటిల్ లక్ష్యంగా చెన్నై బరిలోకి దిగుతోంది. అయితే ‘కొత్త సీజన్.. కొత్త పాత్ర కోసం ఎదురు చూస్తున్నా’ అని ధోనీ పెట్టిన పోస్టు వైరల్ అవ్వడంతో.. ఆ కొత్త పాత్ర ఏంటోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Here’s the Thala MS Dhoni entry video 💛
Russ touched his feet 🥹
pic.twitter.com/ij1Crb2YAt— ` (@WorshipDhoni) March 5, 2024