Site icon NTV Telugu

Santhi Kumari: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. అధికారులకు సీఎస్ కీలక సూచనలు

Santhikumari

Santhikumari

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. పెద్ద వాగు వరద పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పునరావాస చర్యలపై చర్చించారు.

READ MORE: Breaking: తన విడాకులను కన్ఫామ్ చేసిన హార్దిక్..

పెద్దవాగుకు చెందిన మూడు గేట్లు ఎత్తడంతో సమీపంలోని నాలుగు గ్రామాలలోకి వరద నీరు చేరిందని.. వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న 28 మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెండు హెలికాప్టర్ల సహాయంతో రక్షించి సురక్షింత ప్రాంతాలకు తరలిచామని జిల్లా కలెక్టర్ జితేష్ తెలిపారు. మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని వెల్లడించారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

READ MORE:HIV: హెచ్ఐవీని జయించిన ప్రపంచంలో ఏడో వ్యక్తి..

ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని డీజీపీ జితెందర్ తెలిపారు. భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు ఎత్తాల్సివచ్చిందని, ప్రస్తుతం వరద తగ్గిందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరించారు.

Exit mobile version