NTV Telugu Site icon

CS Shanti Kumari : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్భందీగా నిర్వహిస్తున్నాం

Cs Shanti Kumari

Cs Shanti Kumari

ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్భందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమిషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారన్నారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని సీఎస్‌ ఆదేశించారు.

Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్స్ట్.. ఆ స్టార్ హీరో కొడుకుతో కాదు కానీ?

అనంతరం TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు.

Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు