Site icon NTV Telugu

CS Jawahar Reddy: ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లు పరిష్కరించాలి

Jawahar Reddy

Jawahar Reddy

ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో గ్రామ,వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలను ప్రస్తుతం ఉన్నసిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేదా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా త్వరితగతిన భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలక్టర్ల సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం,డెలిగేషన్ ఆఫ్ పవర్స్,ఎపిపిఎస్సి ద్వారా గ్రూప్ 1,2 పోస్టుల ఖాళీల భర్తీ,ఇ-ఆఫీసు ద్వారా ఇ-రిసీప్ట్స్,ఇ-డిస్పాచ్ ఆపరేషనలై జేషన్,ఎసిబి,విజిలెన్స్ కేసుల పరిష్కారం,కలెక్టర్లతో వీడియో సమావేశా ల్లో వచ్చిన అంశాలపై పాలోఅప్ చర్యలు,అసెంబ్లీకి సంబంధించి పెండింగ్లో ఉన్నవివిధ ఎల్ఏక్యు,ఎల్సిక్యులపై సత్వరం సమాచారం అందించడం,ఎపిఆన్లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర అజెండా అంశాలపై సిఎస్.డా.జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు. సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లాల్లో గ్రామ,వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేదే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు ద్వారా ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు.

Read Also: Cheteshwar Pujara: 100వ టెస్టు ముంగిట పుజారా.. చిరకాల కోరిక అదేనంట!

గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1,2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని చెప్పారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానం కింద ఇ-రిసీప్ట్స్,ఇ-డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు.త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్ననేపధ్యంలో అసెంబ్లీ,శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివిధ శాఖలు అందించాల్సిన సమాధానాలను త్వరిత గతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నఎసిబి,విజిలెన్సు కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.అదే విధంగా ఎపి ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజిమెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్నకోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలుచేయడం కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

దీనిపై త్వరలో జిపిలు,కార్యదర్శులతో ఒక వర్కు షాపు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి చెప్పారు. గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట స్టాప్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్ధికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కార్యదర్శులను ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో పలు ఇతర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు. ఈసమావేశానికి తొలుత సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ స్వాగతం పలుకగా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్,జి.సాయిప్రసాద్,బి.రాజశేఖర్, అజయ్ జైన్,రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శులు యం.టి.కృష్ణబాబు,శ్యామల రావు,ప్రవీణ్ ప్రకాశ్,హరీశ్ కుమార్ గుప్త,శశిభూషణ్ కుమార్,చిరంజీవి చౌదరి,యం.రవి చంద్ర,కాంతిలాల్ దండే,వాణీమోహన్ తోపాటు కార్యదర్శులు సౌరవ్ గౌర్,సత్య ప్రభాకర్ రావు,పి.బాలకృష్ణ మాచార్యులు,కెవి.సత్యనారాయణ సహా పలువురు కార్యదర్శులు,పలువురు శాఖాధిపతులు పాల్గొన్నారు.

Read Also: Suicide Attempt: నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు.. రక్షించిన పోలీసులు.. ఎలాగంటే..?

Exit mobile version