NTV Telugu Site icon

Masthan Sai : అసభ్యంగా ఫోటోలు, వీడియోలు.. మస్తాన్‌ సాయి కేసులో సంచలన విషయాలు

Masthan Sai Drugs Case

Masthan Sai Drugs Case

Crucial Findings in Masthan Sai Case: రాజ్ తరుణ్ -లావణ్య కేసులో ప్రధానంగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఈ మస్తాన్ సాయిని తాజాగా పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ పెడ్లర్‌ గా ఉన్న మస్తాన్‌ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్‌ సాయి అరెస్ట్‌తో కదులుతున్న డ్రగ్స్‌ డొంక లో అనేక అంశాలు తెలుస్తున్నాయి. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీస్తే వెలుగులోకి మస్తాన్‌ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం వచ్చింది.

Sobhita : ఆమె కుక్కగా పుట్టినా పర్లేదు… సమంతపై శోభిత పాత పోస్ట్ వైరల్!

ప్రీతి, ఉదయ్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్న వీడియోలు బయట పడ్డాయి. అమ్మాయిలతో అసభ్యంగా ఫోటోలు, వీడియోలు మస్తాన్‌ సాయి రికార్డ్‌ చేసినట్టు గుర్తించారు. డ్రగ్స్ కావాలి తీసుకొని రమ్మని వాట్సప్ చాటింగ్ చేసిన ప్రీతి, తనకు తిక్క రేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని వాట్సప్ చాటింగ్ లో పేర్కొంది. రెండు తెలుగు రాష్టాల్లో ఎక్కడికక్కడ నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేస్తున్నా డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు సీరియస్ కావడంతో ఈ డ్రగ్స్ దందా మీద ఎక్కడిక్కడ దాడులు చేస్తూ తీగలాగి డొంక అంతా కదిలించే పనిలో ఉన్నారు.

Show comments