Site icon NTV Telugu

Crispy Fish Fry : చేపలను ఇలా ఫ్రై చేస్తే చాలు.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!

Fish Fry.jp

Fish Fry.jp

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉండటంతో ఎక్కువ మంది తినడానికి ఇష్ట పడతారు.. ఇక రకరకాల వంటలను చేసుకొని తింటారు.. అందులో ఒకటి చేపల ఫ్రై కూడా ఒకటి.. ఎంత కరకరాలాడుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటే పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు..రెస్టారెంట్ లలో లభించే విధంగా కలర్ ఫుల్ గా, క్రిస్పీగా ఉండే చేపల ఫ్రైను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ చేపల ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

ఉప్పు – ఒక టీ స్పూన్,

కారం – ఒక టేబుల్ స్పూన్,

కాశ్మీరీ కారం -ఒక టీ స్పూన్,

పసుపు – పావు టీ స్పూన్,

మిరియాల పొడి -ఒక టీ స్పూన్,

ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్,

జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్,

కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్,

బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్,

నిమ్మరసం – అర చెక్క,

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్,

గరం మసాలా – అర టీ స్పూన్,

చేప ముక్కలు – 750 గ్రా,

నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

తయారీ విధానం..

ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.తరువాత ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో చేప ముక్కలను వేసి మసాలాలు చక్కగా పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను వేసి వేయించాలి. ఈ చేప ముక్కలను మధ్యస్థ మంటపై రెండు వైపులా చక్కగా ఎర్రగా క్రీస్పిగా వచ్చేవరకు వేయించాలి.. ఇలా అన్ని ముక్కలను బాగా దోరగా వేయించాలి.. ఇక అదే నూనెలో పచ్చి మిర్చి చీలికలను, కరివేపాకును వేసి వేయించాలి.. ఇక వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి.. టేస్ట్ అదిరిపోతుంది.. అంతే చేపల ఫ్రై చెయ్యడం ఎంత సులువో చూసారుగా మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version