Site icon NTV Telugu

Pregnant Woman: మధ్యప్రదేశ్‌లో దారుణం.. గర్భిణిపై సామూహిక అత్యాచారం, ఆపై నిప్పంటించి..!

Rape

Rape

Pregnant Woman Raped in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు. ఈ దారుణ ఘటన మొరెనా జిల్లా అంబాహ్ పట్టణానికి సమీపంలోని చాంద్ కా పురా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంబాహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అలోక్ పరిహార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తన భర్త మీద అత్యాచార ఆరోపణలు చేసిన ఓ మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు ఆ గర్భిణి చాంద్ కా పురా గ్రామానికి వెళ్లింది. ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ, ఈ ముగ్గురు కలిసి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గర్భిణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆ,ఆమెను కాపాడారు. ప్రస్తుతం బాధితురాలు గ్వాలియర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: Bhimaa Movie: గోపీచంద్‌ పర్‌ఫార్మెన్స్‌ మరో స్థాయిలో ఉంటుంది!

తనపై ముందుగా సామూహిక అత్యాచారం చేసి, ఆపై ముగ్గురు పురుషులు కలిసి నిప్పంటించారని బాధితురాలు వీడియోలో పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితురాలైన మహిళ భర్త గతంలో ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.

Exit mobile version