Site icon NTV Telugu

Yashasvi Jaiswal: వన్డేల్లో తొలి సెంచరీతో చెలరేగి.. శతకాల ఖాతా ఓపెన్ చేసిన జైస్వాల్

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతోంది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై గా మారింది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 271 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించింది.

Also Read:Notices To IndiGo: ఇండిగోకు నోటీసులు ఇచ్చిన విమానయాన శాఖ..

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ చెలరేగి ఆడారు. బ్యాట్ ఝుళిపిస్తూ పరుగుల వరద పారించారు. ఈ వన్డే మ్యాచ్ లో టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి తన తొలి ODI సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డేల్లో శతకాల ఖాతా ఓపెన్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన విజయవంతమైన ఛేజింగ్‌లో యశస్వి జైస్వాల్ పవర్ ఫుల్ సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి ODI సెంచరీ. జైస్వాల్ తన నాలుగో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించాడు, మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఆరో భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీ చేశాడు.

Exit mobile version