Site icon NTV Telugu

Top 10 ODI Run Scorers: 2025 వన్డేల్లో పరుగుల వరద పారించిన టాప్ 10 స్టార్లు వీరే!

Top 10 Odi Run Scorers 2025

Top 10 Odi Run Scorers 2025

Top 10 ODI Run Scorers: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం పూర్తికాబోతుంది. ఈ ఏడాదిలో చాలా మంది ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో దుమ్మురేపారు. ప్రస్తుత సంవత్సరంలో ఒక్క వన్డే కూడా మిగిలి లేకపోవడంతో, ఈ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బ్యాట్స్‌మెన్‌ల ఎవరు, టీమిండియా తరుఫున ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. దేశంలో భారీగా పెరగనున్న MBBS సీట్ల సంఖ్య

జో రూట్..
2025లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును జో రూట్ సొంతం చేసుకున్నాడు. 2025లో ఈ స్టార్ తన జట్టు తరపున మొత్తం 15 మ్యాచ్‌లు ఆడాడు. 15 ఇన్నింగ్స్‌లలో 57.71 సగటుతో 808 పరుగులు చేసి వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

డారిల్ మిచెల్..
న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ 2025లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. 2025లో కివీస్ తరపున మిచెల్ 17 మ్యాచ్‌లు ఆడి, 16 ఇన్నింగ్స్‌లలో 54.35 సగటుతో 761 పరుగులు చేశాడు.

జార్జ్ మున్సే..
స్కాట్లాండ్ బ్యాట్స్‌మన్ జార్జ్ మున్సే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మున్సే 2025లో తన జట్టు తరపున మొత్తం 11 మ్యాచ్‌లు ఆడి, 11 ఇన్నింగ్స్‌లలో 73.50 సగటుతో 735 పరుగులు చేశాడు.

మాథ్యూ బ్రిట్జ్కే..
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచాడు. ఈ స్టార్ 2025లో దక్షిణాఫ్రికా తరపున మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి, 12 ఇన్నింగ్స్‌లలో 64.18 సగటుతో 706 పరుగులు చేశాడు.

షాయ్ హోప్
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ ఐదవ స్థానంలో నిలిచాడు. 32 ఏళ్ల ఈ ఆటగాడు 2025లో వెస్టిండీస్ తరపున 15 వన్డేలు ఆడి, 15 ఇన్నింగ్స్‌లలో 55.83 సగటుతో 670 పరుగులు చేశాడు.

అఘా సల్మాన్
పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ అఘా సల్మాన్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 2025లో ఈ బ్యాట్‌మెన్స్ 16 ఇన్నింగ్స్‌లలో 47.64 సగటుతో 667 పరుగులు చేశాడు.

మిలింద్ కుమార్
USA బ్యాట్స్‌మన్ మిలింద్ కుమార్ ఏడో స్థానంలో నిలిచాడు. 2025లో మిలింద్ మొత్తం 12 వన్డేలు ఆడి, 12 ఇన్నింగ్స్‌లలో 81.50 సగటుతో 652 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం 13 వన్డేలు ఆడి, 13 ఇన్నింగ్స్‌లలో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ
ఈ జాబితాలో రోహిత్ శర్మ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. ‘హిట్‌మ్యాన్’ ఈ సంవత్సరం 14 వన్డేలు ఆడి, 14 ఇన్నింగ్స్‌లలో 50.00 సగటుతో 650 పరుగులు చేశాడు.

రచిన్ రవీంద్ర
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10లో రచిన్ రవీంద్ర చివరి స్థానంలో ఉన్నాడు. ఈ కివీస్ స్టార్ ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడి, 14 ఇన్నింగ్స్‌లలో 43.14 సగటుతో 604 పరుగులు చేశాడు.

READ ALSO: Google 67 Search Trick: Google లో 67 అని సెర్చ్ చేశారా? అయితే షేక్ కావాల్సిందే..

Exit mobile version