Site icon NTV Telugu

Cricket Balls Meerut: మన దేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ లకు క్రికెట్ బాల్స్ ను ఎక్కడ తయారుచేస్తారో తెలుసా..?!

13

13

ప్రస్తుతం భారత్ లో ఐపిఎల్ మానియా నడుస్తోంది. సాయంత్రం అయిందంటే చాలు క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు మొబైల్స్ నుండి తలలు పక్కకు తిప్పడం లేదు. కేవలం భారత్ లోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఐపీఎల్ కు మంచి ఆదరణ ఉంది. ఇకపోతే భారతదేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి బాల్స్ ఎక్కడ తయారు చేస్తారు..? అది ఎలా తయారు చేస్తారు..? అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? లేదు కదా.. ఓసారి ఇప్పుడు తెలుసుకుందాం.

Also read: Maharashtra: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ కోడలు..

దాదాపుగా భారతదేశంలో జరిగే దేశీయ అంతర్జాతీయ క్రికెట్ కు సంబంధించిన క్రికెట్ బంతులు మన దేశంలో ఉన్న మీరట్ నగరంలో తయారవుతాయి. మీరట్ నగరంను స్పోర్ట్స్ సిటీ అని కూడా అంటారు. ఒక్క క్రికెట్ కు మాత్రమే కాకుండా అనేక ఆటల వస్తువులకు సంబంధించిన ప్రతి వస్తువు మీరట్ లో సంబంధించిన ప్రతి వస్తువు మీరట్ లో ఎక్కువగా తయారవుతాయి. కేవలం మీరట్ నుండి ప్రతి ఏటా 500 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంటే అక్కడ ఏ రేంజ్ లో ఆట వస్తువులకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

Also read: Daniel Balaji : చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగునింపిన నటుడు.. ఎంత గొప్ప మనసు నీది..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అత్యాధునిక మిషన్లు కనిపెట్టినప్పటికీ.. వాటి ద్వారా క్రికెట్ బాల్స్ ను తయారుచేసిన ప్పటికీ., మీరట్ లో తయారుచేసిన బాల్స్ ను మాత్రమే వాడటం విశేషం. అయితే ఈ బాల్ తయారు చేయడానికి వ్యక్తులు చాలానే శ్రమించాల్సి వస్తుంది. ముందుగా బాల్ కోసం ఒరిజినల్ లెదర్ ను ప్రాసెస్ చేయడం నుంచి బాల్ స్టిచ్చింగ్ అలాగే బాల్ పాలిష్ సంబంధించిన ఎన్నో రకాల దశలను దాటుకొని తయారవుతుంది. బిసిసిఐ, ఐసీసీ కూడా అధికారికంగా భారత్ లో ఎస్జి తయారు చేసే క్రికెటర్ బాల్స్ కు ఆముదముద్రవేశాయి. అందుకే కాబోలు భారత్ లో మొదటి నుంచి ఈ బాల్స్ ని వాడుతారు. ఇక ఇంగ్లాండ్ దేశంలో డ్యూక్ బాల్స్ ను వాడుతుండగా.. ఆస్ట్రేలియాలో కుక్కబుర్ర అనే కంపెనీ బాల్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా భారత్ లో తయారయ్యే ఒక్కొక్క బాల్ ఖరీదు సుమారు రూ. 12000 వరకు ఉంటుంది. ఒక్కొక్క టి20 మ్యాచ్ లో 4 బాల్స్ ఉపయోగిస్తారు. ఒక ఇన్నింగ్స్ లో రెండు చొప్పున మొత్తం నాలుగు బాల్స్ ను ఉపయోగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో వాడే రెడ్, వైట్, పింక్ కలర్స్ బాల్స్ అన్ని కూడా మీరట్ లోనే తయారవుతున్నాయి.

Exit mobile version