Mokshajna : నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోలతో హల్ చల్ చేస్తున్నారు. బాలయ్య బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒకపక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో బాలయ్య బాబు కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలంగా చర్చ నడిచింది.
Read Also:Chanchalguda: చంచల్ గూడ జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నారు మోక్షజ్ఞ. అయితే ఈ క్రేజీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ నందమూరి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. మొదటి షెడ్యూల్ లో మోక్షజ్ఞ పై ఓ సాంగ్ కి సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్స్ చిత్రీకరిస్తారట.
Read Also:Chanchalguda: చంచల్ గూడ జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ
ఇప్పటికే ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్ ను మేకర్స్ రివీల్ చేయగా అది చాలా వైరల్ అయింది. కాగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్లు బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. మొత్తమ్మీద నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.