Cradle Ceremony For Calf: ఎక్కడైనా పిల్లలకు ఉయ్యాల వేడుక నిర్వహిస్తారు.. కొన్ని ఏరియాల్లో దీనినే 21వ రోజుగా కూడా పిలుస్తారు.. ఇక, మన సాంప్రదాయంలో ఆవులకు, ఆవు దూడలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఆవును గోమాతగా పిలుస్తారు, కొలుస్తారు.. తాజాగా, కృష్ణాజిల్లా గన్నవరం మండలం పుంగనూరులో పెయ్య దూడకు ఉయ్యాల వేడుక నిర్వహించారు దంపతులు.. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ కి చెందిన నందిగాం వెంకట నారాయణ, లలిత దేవి దంపతులు నివాసం ఉంటున్నారు.. పసుపోషన అంటే వారికి ఎంతో మక్కువ.. ఆప్యాయంగా పెంచుకుంటున్న పుంగునురు అవుకు పేయ్య దూడ జన్మించటంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ జంట.. 22 రోజుల తరువాత ఆ పెయ్యా దూడకు ఉయ్యాల వేడుక నిర్వహించారు.
Read Also: Etala Rajender: నా వల్లే దళిత అధికారి నియామకం
ఉదయాన్నే దూడకి స్నానం చేయించి.. కొత్త చీరతో అలంకరించి.. శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు వెంకట నారాయణ, లలితా దేవి దంపతులు.. ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలో పేయ్యా దూడను ఉంచి గౌరీ అని నామకరణం చేశారు ఆ దంపతులు.. నాలుగు ఏళ్ల క్రితం 30 వేలకు కొనుగోలు చేసిన పుంగనూరు ఆవుకు గత ఏడాది ఒక గిత్త దూడ పుట్టింది.. ఈ సారి పెయ్య దూడ జన్మించటంతో చాలా ఆనందంగా ఉందని వెంకట నారాయణ దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక, దూడకి ఉయ్యాలో వేడుక సమాచారం తెలుసుకున్న స్థానికులు.. ఆ వేడుకను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇక, దూడకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..
