Site icon NTV Telugu

CP Sajjanar: మరలా తుపాకీ ప‌ట్టిన వీసీ స‌జ్జ‌నార్‌.. థ్రిల్లింగ్‌గా ఉందంటూ పోస్ట్!

CP VC Sajjanar

CP VC Sajjanar

ఐపీఎస్ ఆఫీస‌ర్ వీసీ స‌జ్జ‌నార్ పేరు చెప్పగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టు’ అనే. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎన్నో ఎన్‌కౌంట‌ర్‌లు చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స‌జ్జ‌నార్ మ‌ళ్లీ తుపాకీ ప‌ట్టారు. గురువారం ఉద‌యం హైద‌రాబాద్ శివార్ల‌లోని తెలంగాణ గన్‌ అండ్‌ పిస్టల్‌ అకాడమీ (TGPA)లో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. హైద‌రాబాద్ సిటీ పోలీసు బృందంతో క‌లిసి పిస్ట‌ల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు.

Also Read: Kodanda Reddy: మాట నిలబెట్టుకున్న కోదండరెడ్డి.. వ్యవసాయ శాఖకు రాసిచ్చిన 4 కోట్ల విలువైన భూమి!

ఫైరింగ్ ప్రాక్టీస్‌ సందర్భంగా సీపీ సజ్జనార్ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఈ రోజు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ బృందంతో కలిసి TGPAలో ఫైరింగ్ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాను. రేంజ్‌ వద్ద మళ్లీ ఉండటం ఎప్పటిలాగే అద్భుతమైన అనుభూతి. బుల్స్‌ఐని (నిశానా గుండ్రాన్ని) తాకడం ఉత్సాహకరమైన అనుభవం’ అని పేర్కొన్నారు. సజ్జనార్‌ తుపాకీతో ఫైరింగ్‌ చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆయన తన సిబ్బందితో సమానంగా ప్రాక్టీస్‌లో పాల్గొనడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version