CP Sajjanar: ఐ-బొమ్మ ఇమ్మడి రవి టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు.. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడని స్పష్టం చేశారు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ ప్రసంగించారు. ఐ బొమ్మ సైట్‌ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడని తెలిపారు. One win, one X betను ఎక్కువగా ప్రమోట్ చేశాడు.. Apk ఫైల్స్ ను డౌన్లోడ్ చేయించాడు. వ్యక్తిగత సమాచారం దోచుకున్నాడన్నారు. ఇలాంటి వెబ్సైట్ ల జోలికి వెళ్లొద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరాడు.. ఇమ్మడి రవి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి..!! హైదరాబాద్ పోలీస్ ను అంత తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు… కొన్ని నెలల పాటు శ్రమించి ఇమ్మడి రవిని పట్టుకున్నామన్నారు. ఇమ్మడి రవిని పట్టుకున్న తర్వాత చాలా మంది పోలీసుల పైన మీమ్స్ చేస్తున్నారు. అది సరైంది కాదు.. చేసే వాళ్ళ పైన కూడా నిఘా ఉంటుందని హెచ్చిరించారు.. ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఆ విషయం మర్చిపోయారన్నారు.
READ MORE: CP Sajjanar: ఐ బొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది డాటా ఉంది.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ..
