Site icon NTV Telugu

CV Anand: మీ దగ్గర తుపాకులుంటే వెంటనే ఇచ్చేయండి

New Project (88)

New Project (88)

CV Anand: ఇటీవల ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూ్ల్ విడుదల కావడంతో రాష్ట్రంలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో పోలీసులు సోమవారం భారీగా డబ్బులు, బంగారం సీజ్ చేశారు. ఇక, తాజాగా సీపీ సీవీ ఆనంద్ రాజకీయ నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తమ దగ్గరున్న వెపన్స్ వెంటనే డిపాజిట్ చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16 లోపు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో వెపన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఒక వేళ్ల అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదలై.. అంతా సర్దుకున్నాక.. డిసెంబర్ 10 తర్వాత వచ్చి తమ వెపన్స్ తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Read Also:Karnataka : ఘోర ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయిన కారు.. ఏడుగురు మృతి..

అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మద్యం, డబ్బులు పంపిణీ, రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు. డ్రగ్స్ పై మరింత ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. రౌడీలు, గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయన్నారు. ఆన్లైన్ డబ్బులు పంపిణీ, ట్రాన్స్ఫర్ పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు సీవీ ఆనంద్. బ్యాంక్ సహాయం తీసుకొని డిజిటల్ పేమెంట్స్ పై ఫోకస్ చేయబోతున్నామన్నారు. 15 నియోజకవర్గాలలో 15 మంది నోడల్ ఆఫీసర్లను పెట్టామన్నారు.

Read Also:Nara Lokesh: ఇక నారా లోకేష్‌ వంతు..! నేడు సీఐడీ ముందుకు..

Exit mobile version