NTV Telugu Site icon

Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే

Corona Updates

Corona Updates

Coronavirus : కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి రికవరీ అయిన వారు ఏడాదిన్నర పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలన్నారు. లేదంటే వారిలో మహమ్మారి శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడని వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్ కు గురైన వారు పలు గుండె సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇది మరణానికి దారితీయవచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి చెందిన కార్డియో వాస్క్యులర్ రీసెర్చ్ అనే జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు లక్ష అరవై వేల మందిపై తమ పరిశోధనలు నిర్వహించారు.

Read Also: Deccan Mall Fire : సికింద్రాబాద్ ప్రమాద ఘటనలో విషాదం.. 2మృతదేహాల గుర్తింపు

కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిని ముఖ్యంగా సంవత్సరం పాటైనా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని వీరు సూచిస్తున్నారు. ఆ కాలంలో గుండె సంబంధిత సమస్యలు బయటపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన తర్వాత మొదటి మూడు వారాల్లో మరణించే ముప్పు 81 రెట్లు అధికమని, ఆ తర్వాత 18 నెలల కాలంలో మరణ రిస్క్ ఐదు రెట్లు అధికంగా ఉంటుందని వీరు అంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ కు లోనై, తీవ్ర దశలో ఉంటే గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత దశలో 40 శాతం గుండె జబ్బులు ఏర్పడే రిస్క్ ఉంటుంది. మొత్తానికి దీర్ఘకాలంలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డీప్ వీన్ థ్రోంబోసిస్ ఏర్పడే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.