NTV Telugu Site icon

Covid Cases: తెలంగాణలో విస్తరిస్తున్న కోవిడ్… పొంతన లేని లెక్కలు ప్రకటిస్తున్న సర్కార్

Covid Cases Telangana

Covid Cases Telangana

Covid Cases: తెలంగాణలో అన్నీ జిల్లాలకు కోవిడ్ విస్తరిస్తుంది. అత్యధికంగా హైదరాబాద్ లోనే కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 63 కేసులు కాగా.. కేవలం హైద్రాబాద్ లో 53 కొవిద్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే జిల్లాలలో కూడా వందల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలు వైద్యశాఖ బులిటెన్ లో చూపించడం లేదు. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా సర్కారు లెక్కలు ఉంటున్నాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. నిన్న కేవలం 8 కేసులు వచ్చినట్లు కరోనా బులిటెన్ విడుదల చేయడంతో పలు అనుమానం వ్యక్తమవుతున్నాయి. 1333 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే కేవలం 8 కేసులు అంటూ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 ఆక్టివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మిగితా వారు డిశ్చార్జ్ అవ్వగా.. నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చినట్టు సమాచారం. దీంతో ప్రజలకు సర్కారు కరోనా లెక్కలను లైట్ తీసుకుంటున్నారు. మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని వైద్యులు సూచిస్తున్న పట్టించుకోవడం లేదు. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతాయనే టెన్షన్ లో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అందుకు అనగుణంగా ఆస్పత్రులను ఆరోగ్య శాఖ సన్నద్ధం చేస్తున్నారు.

Read also: Kajal Aggarwal: చిట్టిపొట్టి దుస్తుల్లో కాజల్ అగర్వాల్ అందాల హొయలు…

రానున్న నాలుగు వారాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జనవరి మొదటి వారంలో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో INSACOG నివేదికపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు, 6 రాష్ట్రాల్లో JN.1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లలో కేసులు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినప్పుడు, JN.1 సబ్-వేరియంట్ కనుగొనబడింది. ఇప్పటివరకు JN.1 సబ్ వేరియంట్ కేసులు 69కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గోవాలో 34 మంది, కర్ణాటకలో 8, కేరళలో 6, మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4 మందికి పాజిటివ్ పరీక్షలు చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!