Site icon NTV Telugu

ఆరు నెలల్లో అందుబాటులోకి చిన్నారులకు వ్యాక్సిన్‌

భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందన్నారు అదర్‌ పునావాలా. కోవోవాక్స్‌ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు.

కోవోవాక్స్‌తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం తమ విధానమన్నారు. కోవోవాక్స్‌ వ్యాక్సిన్‌ స్టాక్‌ భారీగానే ఉందని, డ్రగ్‌ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాతే…. భారత్‌తో పాటు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల జారీలో జాప్యం జరుగుతున్నది. కాగా.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా… కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా విజయ వంతంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో వంద కోట్లకు పైగా మందికి సింగిల్ డోస్ ను అందించాయి ప్రభుత్వాలు.

Exit mobile version