Site icon NTV Telugu

Gyanvapi mosque case: నేడు జ్ఞాన్‌వాపీ మసీదులో సర్వే నివేదిక బహిర్గతంపై తుది తీర్పు

Gyanvapi Mosque

Gyanvapi Mosque

జ్ఞానవాపీ మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే నివేదికను బహిరంగపరచడంపై ఈ రోజు కోర్టు తన తీర్పుపై విచారణ చేసి తుది తీర్పును ప్రకటించనుంది. అయితే, జ్ఞానవాపీ మసీద్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సర్వేను బహిర్గతం చేయొద్దని ముస్లీం సంఘాలు కోరగా.. సర్వేను బహిర్గతం చేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. దీంతో డిసెంబర్ 18న పలు పిటిషన్లు కోర్టులో దాఖలు కావడంతో.. ఈ నివేదికపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విషయంపై కోర్టు నిన్ననే తుది తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. కానీ, కోర్టు ఈరోజే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Also: MLC Vamsi Krishna: విశాఖకు దొరికిన ఆణిముత్యాలు.. ఆ ఇద్దరిపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ సెటైర్లు

అయితే, జ్ఞానవాపీ మసీదు కేసులో విచారణ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యాయవాది అమిత్ శ్రీవాస్తవ, నివేదికను నాలుగు వారాల పాటు బహిరంగపరచవద్దని అభ్యర్థించారు. 1991 నాటి లార్డ్ అడ్జెక్టివ్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత నివేదికను కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుందని వాదనలు వినిపించారు. దీనిపై జనవరి 19న వారణాసిలోని సీనియర్ జడ్జి సివిల్ డివిజన్ కోర్టులో విచారణ జరగనుంది. కాబట్టి అప్పటి వరకు నివేదికను బహిర్గతం చేయరాదని చెప్పుకొచ్చారు. కాగా, ఏఎస్ఐ సీల్డ్ రిపోర్టును దాఖలు చేయడం కూడా తప్పు.. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

Exit mobile version