కోర్ట్ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ మూవీ హిట్3 చూడొద్దు అంటూ నాని స్టేట్ మెంట్ చూస్తేనే అర్థమౌతుంది ఆ మూవీపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో. నిజంగా ఆయన అంచనాలను తల్లకిందులు చేయలేదు కోర్ట్. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ కోర్టు రూమ్ డ్రామా. మెగాస్టార్ చిరంజీవి సైతం టీంని ఇంటికి పిలిచి అభినందించారు. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక కూడా యాక్టర్లను, టీంని ప్రశంసిస్తూ స్పెషల్ గిఫ్ట్ పంపారు.
Also Read : The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?
చందు, జాబిల్లి క్యారెక్టర్లకు రోషన్, శ్రీదేవి ఎంత పేరొచ్చిందే.. లాయర్ పాత్రలో ప్రియదర్శి మరోసారి తన మార్క్ చూపించాడు. మంగపతి క్యారెక్టర్లలో శివాజీ ఫెర్మామెన్స్ మూవీకి హైలెట్. ఇక ఇందులో కథలెన్నో చెబుతారు సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో చార్ట్ బస్టర్‌గా మారింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రామ్ జగదీష్ తెరకెక్కించిన కోర్ట్‌ను వాల్ పోస్టర్ బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. 50 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ ఫిల్మ్.. ఇప్పుడు ఈ బొమ్మ తమిళంలో రీమేక్‌కు రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కతిరేసన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ ఎప్పుడో కొనుగోలు చేశారు. రోషన్, శ్రీదేవి పాత్రల్లో దేవయాని కూతురు ప్రియాంక, కతిరేసన్ కొడుకు హరి కతిరేసన్ చేస్తున్నాడు. ప్రియదర్శి క్యారెక్టర్‌ను ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడు.. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తున్నాడట. ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఓటీటీ పుణ్యమా అని ఈ సినిమాను ఆడియన్స్ చూసేయగా.. మళ్లీ తమిళ తంబీలు ఈ సినిమాను చూస్తారా అనేది డౌట్.
