Site icon NTV Telugu

Sikh seminary: 5 మంది పిల్లల్ని కనండి.. మీరు వారిని పెంచలేకపోతే మాకు ఇవ్వండి

Sigh

Sigh

Sikh seminary: సిక్కుల సంస్థ దామ్‌దామి తక్సల్ అధినేత గియానీ హర్నామ్ సింగ్ ఖల్సా సిక్కులు ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఈ కామెంట్స్ చేశారు. సిక్కులు కనీసం 5 మంది పిల్లల్ని కనండి.. మీరు వారిని పెంచలేకపోతే మాకు నాలుగురిని ఇవ్వండి అని విజ్ఞప్తి ఆయన చేశారు. పిల్లల సంఖ్యను పెంచడం ద్వారా కుటుంబ విలువలను కాపాడేందుకు దోహదపడుతుందన్నారు. అంతే కాకుండా సమాజం కూడా బలపడుతుందన్నారు. దమ్‌దామి తక్సల్‌కు కూడా ఖలిస్తానీ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నాయకత్వం వహించారు. ఎవరైనా ఎక్కువ మంది పిల్లలను పెంచడంలో సమస్య ఎదుర్కొంటే, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, మా సంస్థ వారికి సహాయం చేస్తుందని హర్నామ్ సింగ్ ఖల్సా చెప్పుకొచ్చారు.

Read Also: INDIA Alliance: ఎన్నికల కమిషన్ తో నేడు ఇండియా కూటమి నేతల సమావేశం

ఇక, సిక్కు కుటుంబాలు కనీసం 5 మంది పిల్లలను కనాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని దామ్‌దామి తక్సల్ 16వ అధిపతి హర్నామ్ సింగ్ ఖల్సా అన్నారు. ఇది పంజాబ్‌ను మతపరంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందన్నారు. పంజాబ్‌లో నివసించే సిక్కులే కాకుండా ఇతర వర్గాల ప్రజలు కూడా కనీస సంఖ్యలో పిల్లలను కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 5 మంది పిల్లలు ఉంటే వారిలో ఒకరు సాధువు అవుతారని, ఒకరు జఠేదార్ అవుతారు, ఒకరు కుటుంబాన్ని పోషించుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. మీ కుటుంబాన్ని పెంచుకోండి, సమాజాన్ని కాపాడుకోండి అని గియానీ హర్నామ్ సింగ్ ఖల్సా మాట్లాడినా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version