NTV Telugu Site icon

Bike Romance: కదులుతున్న బైకుపై సరసాలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

Couple Romancing

Couple Romancing

Bike Romance: సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి కొన్ని వీడియోలు చూసిన నెటిజన్లు వీళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు. ఈ రోజుల్లో బైక్‌పై రోమాన్స్ చేస్తున్న జంట వీడియోలు వైరల్ అవుతున్నాయి. వారిపై చర్యలు తీసుకున్నా ప్రజలు ఇలాంటి చేష్టలు మానుకోవడం లేదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఢిల్లీలోని మంగోల్‌పురి సమీపంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లై ఓవర్‌పై ఓ యువకుడు తన ప్రియురాలితో బైకు పై దూసుకుపోతుండడం వీడియోలో కనిపిస్తోంది. బైక్ ట్యాంక్‌పై ఓ అమ్మాయిని కూర్చోబెట్టాడు. అమ్మాయి అబ్బాయిని కౌగిలించుకుంది. యువకుడు పలు వాహనాలను ఓవర్‌టేక్ చేస్తున్నట్టు కూడా వీడియోలో కనిపిస్తోంది. ఆ అబ్బాయి తన, అమ్మాయి ప్రాణాలను పట్టించుకోకుండా రోడ్డుపై బైక్‌ను వేగంగా నడుపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే, ఇందులో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, కానీ దాని గురించి వదిలేసి ఇద్దరూ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఎవరో తన మొబైల్‌ కెమెరాలో ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

Read Also:Taapsee Pannu : నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు.. నా పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చు..

ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించగా, వేలాది మంది లైక్ చేశారు. ఈ వీడియో చూసిన జనాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత ప్రమాదకరమైన పని చేయాల్సిన అవసరం ఏముందని కొందరు రాశారు. ఇందులో ఎవరైనా చనిపోవచ్చు. కొందరు యూజర్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి.. అలాంటి వారి హీరోయిజం తొలగించాలని అన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులను ట్యాగ్ చేయడం ద్వారా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

Read Also:Project k: ప్రాజెక్ట్ కె అప్డేట్..హాలీవుడ్ రేంజ్‌లో దీపిక లుక్..