భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUVలకు అత్యధిక డిమాండ్ ఉంది. అద్భుతమైన ఆకృతి, ఇంటీరియర్, ఫీచర్లు మరియు పనితీరు కారణంగా కస్టమర్ల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఎస్ యూవీ కార్లలకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, దేశీయ తయారీదారులు ఇప్పుడు కూపే తరహా డిజైన్‌లతో మొగ్గు చూపుతున్నారు. భారతదేశానికి రానున్న 2 కొత్త కూపే SUVల గురించి తెలుసుకుందాం.
READ MORE: EVM: తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 8 లోక్‌సభ స్థానాలకు చెందిన ఈవీఎంల తనిఖీ.. ఎందుకో తెలుసా?
ఇటీవలే భారత్ కి చెందిన టాటా కంపెనీ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో “టాటా కర్వ్” పేరుతో కూపే ఎస్ యూవీ ప్రదర్శించింది. దీని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇది రాబోయే మూడు లేదా నాలుగు నెలల్లో విడుదల కానుందని భావిస్తున్నారు. సుమారు 4.3 మీటర్ల పొడవుతో, ఈ కూపే SUV ICE, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. దాని ICE పవర్‌ట్రెయిన్ గురించి తెలిపింది. టాటా కర్వ్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. భారతదేశంలో టాటా కర్వ్ ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
READ MORE: Crime News: బావతో కలిసి పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. నెల రోజుల తర్వాత ఇద్దరు మృతి
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవల భారతదేశంలో బసాల్ట్ కూపే SUVని పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించింది. రాబోయే సిట్రోయెన్ బసాల్ట్, ఈ సంవత్సరంలోనే ప్రారంభించబడుతోంది. ఇది స్టెల్లాంటిస్ కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP)పై తయారు చేయనున్నారు. ఈ కారు సుమారుగా 4.3 మీటర్ల పొడవు ఉండనుంది. హుడ్ కింద, సిట్రోయెన్ బసాల్ట్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 110 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
Coupe SUV cars, leading companies, will soon enter the market, Bharat Market, Tata Company, Tata Curve, Citroen, Basalt Coupe