NTV Telugu Site icon

Costly Coffee : ఈ కాఫీకి ఫుల్ డిమాండ్ .. ధర ఎంతో తెలుసా?

Costly Coffee

Costly Coffee

పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. గొంతులో చుక్క పడందే పొద్దు పొడవదు.. అలాంటి కాఫీని బయట కొనాలంటే 20 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది.. రకరకాల కాఫీలు మార్కెట్ లో కనిపిస్తుంటాయి.. కానీ ఒక కప్పు కాఫీ ధర రూ.6 వేలు అంటే నమ్ముతార.. అసలు నమ్మరు.. అమెరికాలో ఓ కాఫీ షాప్ చేస్తున్న కాఫీ ధర అక్షరాల ఆరు వేలు.. దాన్ని ఓ అడవి జంతువు మలంతో తయారు చేస్తారట.. దాన్ని తాగడానికి జనాలు కూడా ఎగబడుతున్నారు.. ఆ కాఫీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పేరు ‘కోపి లువాక్’. దీనిని సివెట్ కాఫీ అని కూడా అంటారు. ఇది సివెట్ లేదా పునుగు పిల్లి మలంతో తయారు చేస్తారు.. ఒక కప్పు సివెట్ కాఫీ కోసం వేల రూపాయలు చెల్లిస్తారు. చాలా ఆనందంగా డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ కప్పు కాఫీ తాగుతుంటారు. ఎందుకంటే ఇది అత్యంత రుచికరమైనది. ఎంతో పోషకమైనది కూడా… ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని చెబుతున్నారు కొందరు..

ఈ సివెట్ పిల్లులు కాఫీ గింజలను తినడానికి ఇష్టపడతాయి. కానీ పిల్లులు చెర్రీ గుజ్జును పూర్తిగా జీర్ణించుకోలేవు. దీనికి కారణం వాటి పేగులలో జీర్ణ ఎంజైమ్‌లు ఉండవు. అందువలన, కాఫీ ఆ భాగం పిల్లి మలంతో బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని శుద్ధి చేస్తారు. అన్ని రకాల సూక్ష్మజీవులు తొలగిపోయేలా చర్యలు తీసుకుంటారు. పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత తదుపరి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ గింజలు కడిగి కాల్చిన తర్వాత కాఫీ తయారు చేస్తారు.. భారతదేశంలోని కర్ణాటక (కొడగు) జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. ఆసియా దేశాలలో, ఇండోనేషియాలో ఇది పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేస్తారు. ఈ కాఫీ కిలో 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుంది.. అమెరికా, అరబిక్ కంట్రీలలో వీటికి డిమాండ్ మాములుగా ఉండదు.. ఒక కప్పు ధర రూ.6 వేలు అని చెబుతున్నారు.. ఇది విన్న కొందరు కామెంట్స్ చేస్తున్నారు..