Corporate Connections: భాగ్య నగరంలో అత్యంత భాగ్యమంతులతో ఒక హైలెవల్ క్లబ్ ఏర్పాటైంది. ఆ అత్యున్నత వేదిక పేరు.. కార్పొరేట్ కనెక్షన్స్. ఇందులో.. వంద కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన బిజినెస్‌మ్యాన్‌లకే చోటు లభిస్తుంది. ఇన్విటేషన్ ఉన్నవాళ్లకి, వెరిఫికేషన్ అయిన అనంతరం మాత్రమే ఈ క్లబ్‌లో సభ్యత్వం కల్పిస్తారు.
read more: T-hub: టీ-హబ్.. సూపర్బ్. సాంకేతిక రంగంలో సాటిలేనిది
బిజినెస్ పెంచుకోవాలనుకునేవాళ్లకి, ఇతర నగరాల నుంచి హైదరాబాద్‌కి వచ్చి వ్యాపారం ప్రారంభించాలనుకునేవాళ్లకి ఈ కార్పొరేట్ కనెక్షన్స్ బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో శాఖలను ఏర్పాటుచేయాలనుకునేవాళ్లకి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కార్పొరేట్ కనెక్షన్స్‌కి ప్రపంచంలోని 25 దేశాల్లో, 51 నగరాల్లో చాప్టర్లు ఉండటం విశేషం.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా గత నెలలో చాప్టర్‌ను ఏర్పాటుచేశారు. సిటీలోని పలువురు వ్యాపారవేత్తలు ఇందులో పార్ట్నర్‌లు అవుతున్నారు. తద్వారా రిఫరెన్స్‌లను పెంచుకొని, పరస్పరం టర్నోవర్ గ్రోత్ కోసం ప్రయత్నాలు చేయనున్నారు.
దేశవిదేశాల్లో వ్యాపార విస్తరణ కోసం సరైన భాగస్వాములను ఎంచుకోవటానికి కార్పొరేట్ కనెక్షన్స్ సరైన ఆప్షన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్లోబల్ స్థాయిలో మిలియనీర్ల నెట్‌వర్క్ ఉండటం బాగా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని బిజినెస్‌మ్యాన్‌లకు ఇది సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని వివరించారు.
మార్చి నెలలో ఏర్పాటైన ఈ బిలియనీర్ల టీమ్‌లో ఇప్పటివరకు 12 మంది జాయిన్ అయ్యారు. విశ్వ నగరంగా పురోగమిస్తున్న హైదరాబాద్‌లో ఇప్పటికే బీఎన్‌ఐ, ఆర్‌బీఎన్ వంటి నెట్‌వర్క్‌లు చాలా ఉన్నాయి. వీటిలో.. స్టార్టప్‌ల ఓనర్లు, ప్రొఫెషనల్స్, వ్యాపారులు, ఎక్స్‌పర్ట్‌లు పెద్ద సంఖ్యలో సభ్యులుగా ఉన్నారు.
ఇదే తరహాలో కార్పొరేట్ కనెక్షన్స్‌లో కూడా గొప్ప ఆలోచనలు కలిగిన బిజినెస్ లీడర్లు ఉన్నారని ఈ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహార్ ఏరుబండి తెలిపారు. ఈయనతోపాటు అనంత్, అజయ్ మంచుకొండ అనే ఇద్దరు మిత్రులు కలిసి కార్పొరేట్ కనెక్షన్స్ హైదరాబాద్ చాప్టర్‌ని నెలకొల్పారు.