NTV Telugu Site icon

Coronavirus Cases: కరోనా వైరస్ విజృంభణ.. ఒక్కరోజే 104 కొత్త కేసులు నమోదు!

Coronavirus

Coronavirus

Karnataka Logs 104 New Coronavirus Cases: భారత దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో గత 24 గంటల్లో 104 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుంది. కర్ణాటకలో డిసెంబరు 15 నుంచి నాలుగు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 5.93%గా ఉంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండురావు నేతృత్వంలో నలుగురు సభ్యుల క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం కర్ణాటకలో 104 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో మొత్తం 271 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 258 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రిలో 13 మంది ఉండగా.. 6 మంది ఐసీయూలో, 7 మంది జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

Also Read: Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. పెళ్లి సంబంధం రద్దు! అచ్చం బలగం సినిమా మాదిరే

మరోవైపు దేశంలో కొత్తగా 752 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు.. రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో గత 24 గంటల్లో 12 కేసులు నమోదవ్వగా..యాక్టివ్ కేసులు 38కి చేరాయి.

Show comments