NTV Telugu Site icon

Coronavirus: నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స!

Niloufer Hospital

Niloufer Hospital

14 Months Child Test Positive for Coronavirus in Niloufer: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ఏడాది కాలంగా ఊపిరి పీల్చుకున్న జనాలు.. గత వారం రోజుల నుంచి భయాందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం.. కేరళ సహా తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా ఐదుగురు మృతి చెందడం. తెలంగాణలో కూడా గురువారం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నాలుగు కేసులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి.

Also Read: Salaar Review: ప్రభాస్ ‘సలార్‌’ మూవీ రివ్యూ!

నిలోఫర్‌ ఆసుపత్రిలో ఓ కరోనా కేసు నమోదైంది. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు. చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నారికి నిలోఫర్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కుదుటపడిందని, వెంటిలేటర్‌ను తొలగించి ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.