ఏపీలో మహమ్మారి కరోనా వైరస్ కేసుల నమోదు కలకలం రేపుతోంది. తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లా ఏలూరుకు చెందిన భార్యభర్తలు, తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యులు వృద్ధుడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ పరీక్షలలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గుంటూరు జిల్లాలో మూడు కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే విశాఖ, నంద్యాల జిల్లాలో మహిళలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
Also Read: PBKS vs MI: ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 1,000 దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఏడుగురు మృతి చెందారు. కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన వారిలో 354 మంది డిశ్చార్జయ్యారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఎన్‌బి.1.8.1, ఎల్‌ఎఫ్.7 వేరియంట్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లు అంత ప్రమాదకరం కాదని డబ్లూహెచ్‌వో తెలిపింది.
