NTV Telugu Site icon

Corbin Bosch: డెబ్యూ మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన కొర్బిన్ బోష్..

Pak Vs Sa

Pak Vs Sa

Corbin Bosch: భారత్-ఆస్ట్రేలియా మధ్య 26 డిసెంబర్ నుండి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్‌లో 19 ఏళ్ల యువకుడు సామ్ కోన్‌స్టాస్ అద్భుతమైన అర్ధసెంచరీతో తన టెస్ట్ క్రికెట్‌ను ప్రారంభించి సంచలనం రేపాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు, నేడే సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభమైంది. సెంట్యూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దానితో పాకిస్థాన్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ, వారి టాప్ ఆర్డర్ చాలా త్వరగా తడబడింది. కెప్టెన్ షాన్ మాసూద్, సామ్ అయూబ్ త్వరగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు మరిన్ని వికెట్లు కోల్పోయింది. అలా బాబర్ ఆజమ్ కూడా 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సౌద్ షకీల్ కూడా 14 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దింతో పాకిస్థాన్ జట్టు 56 పరుగులలోనే 4 వికెట్లు కోల్పోయింది.

Also Read: Rohith Sharma On Yashasvi Jaiswal: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అంటూ రోహిత్ ఫైర్.. (వీడియో)

ఇలాంటి పరిస్థితుల్లో, సౌతాఫ్రికా బౌలర్ కొర్బిన్ బోష్ తన డెబ్యూ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. 30 ఏళ్ల కొర్బిన్ బోష్ టెస్టుల్లో తన తొలి బంతికే పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మాసూద్‌ను అవుట్ చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. షాన్ మాసూద్ కేవలం 17 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కొర్బిన్ బోష్ టెస్ట్ క్రికెట్‌లో డెబ్యూ మ్యాచ్‌లో మొదటి బంతితో వికెట్ తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. ఈ కొత్త రికార్డు కొర్బిన్ బోష్‌ను 2024లో డెబ్యూ మ్యాచ్‌లో మొదటి బంతితో వికెట్ తీసిన మూడో బౌలర్‌గా నిలబెట్టింది. ఈ రికార్డు మొట్టమొదట 1882-83లో మొదలైంది. ఇక ఇప్పుడు కొర్బిన్ బోష్ తీయగా 2024లో వెస్టిండీస్ బౌలర్ శమర్ జోసెఫ్, సౌతాఫ్రికా బౌలర్ త్సేపో మోరెకీ ఈ ఘనత సాధించారు. టెస్ట్ క్రికెట్‌లో ఈ విధమైన ఘనత సాధించిన బౌలర్లు గడచిన సంవత్సరాలలో చాలా అరుదుగా కనిపించారు. 2024లో ముగ్గురు బౌలర్లు ఈ రికార్డును సాధించడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా నిలిచింది.

Show comments