Site icon NTV Telugu

Ap Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు

Weather

Weather

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడితో సతమతమవుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

READ MORE: Congress: “అయోధ్య శ్రీరాముడికి మద్దతు ఇచ్చినందుకు వేధింపులు”.. కాంగ్రెస్‌కి రాధికా ఖేరా గుడ్ బై..

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపారు. రేపు 29 మండలాల్లో, ఎల్లుండి 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. సోమవారం శ్రీకాకుళం10, విజయనగరం 13, పార్వతీపురంమన్యం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.., కర్నూలు జిల్లా జి. సింగవరం- 45.6, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురం- 45.5, ప్రకాశం జిల్లా వెలిగండ్ల -45.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, వైయస్సార్ జిల్లా ఉప్పలూరు, సింహాద్రిపురం- 45.1, అన్నమయ్య జిల్లా టిసుండుపల్లె -44.7, పల్నాడు జిల్లా రావిపాడు-44.4, చిత్తూరు జిల్లా పుంగనూరు- 43.6, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు- 43.3, అల్లూరి జిల్లా యెర్రంపేట- 43.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 5 మండలాల్లో తీవ్రవడగాల్పులు,117 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండతీవ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version