Site icon NTV Telugu

రేప్‌ కేస్‌పై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

రేప్‌ కేసు విషయంలో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి ఆడపిల్లలకు బీచ్‌లో ఏం పని అంటూ అసెంబ్లీలోనే ప్రశ్నించారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా అని నిలదీశారు. బాధ్యతారాహిత్యం అంటూ ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదంటూ సీఎం ప్రమోద్‌ సావంత్‌ తీవ్రంగా స్పందించారు. ఆర్థరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడంపై తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌. ఇటీవల గోవాలో ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారం జరిగింది.

read also : సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. !

దీనిపై గోవా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం సావంత్‌.. బీచ్‌ పార్టీకి వెళ్లిన వారిలో రేప్‌ జరిగిన బాలికలు తప్ప.. మిగతా వారు తిరిగివచ్చారని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే.. ఆ బాధ్యతను పోలీసులపై వదిలేయలేమన్నారాయన. మరోవైపు గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు అడపిల్లలను అవమానించేలా ఉన్నాయని.. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలానేనా మాట్లాడేది అంటూ ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version