Site icon NTV Telugu

Kurnool: లోకాయుక్త భవనంలో తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

Suicide

Suicide

Constable Committed suicide with his Gun in Kurnool:  కర్నూలు జిల్లాలోని సంతోష్ నగరంలో ఉన్న లోకాయుక్త  భవనంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చకొని ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ( హెచ్ సీ 2451) ఆత్మ చేసుకున్నారు. లోకాయుక్తకు బందోబస్తుగా ఉన్న సత్యనారాయణ. విధి నిర్వహణలో ఉండగానే ఆత్మహత్య  చేసుకున్న కానిస్టేబుల్. తన ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన కానిస్టేబుల్. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సత్యనారయణకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె హైదరాబాద్ లో ఉద్యోగం కూడా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మెడికల్ లీవ్ లో ఉండి సత్యనారాయణ శుక్రవారమే విధులకు హాజరయ్యార. వెంటనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్య వెనుక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసలు దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రత్యేకంగా కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. ఇక కానిస్టేబుల్ సత్యనారాయణ తండ్రి శంకరయ్య కూడా రిటైర్డ్ పోలీస్ అధికారే.

Also Read: Asia Cup 2023: సూపర్-4 మ్యాచ్‌లన్నీ వాష్ అవుట్ అయితే.. ఫైనల్ చేరే జట్లేవో తెలుసా? అస్సలు ఊహించరు

ఇక జీతాలు రావడంలేదంటూ  ప్రశ్నిస్తే ఉన్నతాధికారులు అవమానించారనే కారణంతో 4 రోజుల క్రితం రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇక చికిత్స పొందుతూ ఆయన మరణించారు కూడా. ఇలా వరుసగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఆత్మ హత్యకు పాల్పడం కలకలం రేపుతుంది.  ఇక హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని మిగిలిన హోంగార్డులు విధులు బహిష్కరించారు. హోంగార్డుల వేతనాలు వెంటనే చెల్లించాలని, వారిని పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు. ఇక విషయం గురించి ఆలోచించాలని కేసీఆర్ ను వారు కోరుతున్నారు.

 

 

 

 

Exit mobile version