NTV Telugu Site icon

Konda Surekha: ప్రజల కష్టాలు తీరాలంటే రాహుల్ ప్రధాని కావాలి

Sue

Sue

భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశ ప్రజలు కష్టాలను చూశారని.. రాహుల్ ప్రధాని అయితే కష్టాలు తీరతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎల్బీనగర్‌లోని ఫంక్షన్ హాల్‌లో కొండా దంపతుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడారు. ‘‘కొండా దంపతులు సన్మానాలకు దూరం.. సన్మానాలకు అయ్యే ఖర్చుతో అనాథలకు భోజనం అందిచండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేశాం. రైతులకు ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. బీఆర్ఎస్‌లో బీజేపీలో అభ్యర్థుల కోరత ఉంది. అంబేద్కర్‌పై మాట్లాడే నైతిక విలువ కేసీఆర్‌కు లేదు. రాజకీయాల్లో అసభ్య పదజాలం తీసుకువచ్చింది కేటీఆర్, కేసీఆర్‌ని గుర్తించాలి. మోడీ పాలనలో అదానీ, అంబానీ ఆస్తులు పెరిగాయి. ప్రజల్లో ఉండే ప్రధాని కావాలా..? లేక అదానీ, అంబానీలకు కొమ్ము కాసే నాయకుడు కావాలా? కవితను జైలు నుంచి తీసుకొని రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులను పనిచేస్తున్నారు. వరంగల్‌లో కడియం కావ్య గెలుపుకు కృషి చేస్తాం’’ అని సురేఖ తెలిపారు.

కొండా మురళీ కామెంట్స్..
‘‘కొండా మురళీ మాట ఇస్తే.. మాట తప్పాడు. వరంగల్ తూర్పు ప్రజలకు సాయిబాబా సాక్షిగా అండగా ఉంటాం. కడియం కావ్యకు 50 వేల మెజార్టీ ఇస్తాం. మాది శ్రీ కృష్ణదేవరాయల వంశం. రాహుల్ ప్రధాని కావడం ఖాయం. ఇంటింటి ప్రచారం చేస్తాం. ప్రజల భూములను కబ్జా చేస్తే సహించేది లేదు. కబ్జా దారులు పై ఉక్కుపాదం మోపుతాం. సీఎం రేవంత్ రెడ్డి కడియం కావ్యను గెలిపించాలని కోరారు. కడియం కావ్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది.’’ అని మురళీ తెలిపారు.

కడియం శ్రీహరి కామెంట్స్..
‘‘కొండా దంపతులకు ఇంత క్రేజ్ ఉందని విన్నా… కానీ చూడటం ఇదే మొదటి సారి. అందుకే కొంత మందికి అసూయ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కొండా దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన క్షణం.. కొండా దంపతులు కావ్యకు నిండు ఆశీర్వాదం అందించారు. కడియం కావ్య గెలుపు తథ్యం. వరంగల్ తూర్పు ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. కార్యకర్తల ఉత్సాహం చూస్తే కడియం కావ్య గెలుపు తథ్యం. కొండా దంపతులకు కడియం శ్రీహరికి ఎక్కడా విభేదాలు లేవు… అందరం కలిసి పని చేస్తాం.’’ అని కడియం శ్రీహరి అన్నారు.

కడియం కావ్య కామెంట్స్..
‘‘కొండా సురేఖ అభినవ రుద్రమదేవి. కార్యకర్తలను కొండా దంపతులు కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎలా ముందుకు పోవాలో కొండా సురేఖ చెబుతున్నారు. ఈ సమావేశం చూస్తే నా గెలుపు ఖాయమనిపిస్తోంది.’’ అని కావ్య తెలిపారు.