Congress: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. ఏఏ రాష్ట్రాలంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్‌కు నలుగురు, తమిళనాడుకు ఒకరిని ప్రకటించారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్, కోట నుంచి ప్రహ్లాద్ గుంజాల్‌లు బరిలో నిలిచారు. వీరితో పాటు తమిళనాడులోని తిరునల్వేలి లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది సి.రాబర్ట్ బ్రూస్‌కు టికెట్ ఇచ్చారు.
Also Read
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వెళ్తోంది. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులనే బరిలోకి దించుతోంది. మరోవైపు బీజేపీ కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 400కు పైగా సీట్లు ఎన్డీఏకు ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Revanth reddy: మనవడితో కలిసి హోలీ ఆడిన సీఎం రేవంత్
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభం కాగా.. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Warangal: రంగుల పండుగ రోజున వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత..

Cong
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!